ఇంట్లోకి చొరబడి యువతితో అసభ్య ప్రవర్తన.. యువకుడిని స్తంభానికి కట్టేసి చావబాదిన మహిళలు

  • హైదరాబాద్‌లోని మూసాపేట పరిధిలో ఘటన
  • యువతి కేకలు వేయడంతో అప్రమత్తమైన మహిళలు
  • చితకబాది పోలీసులకు అప్పగించిన మహిళలు
యువతితో అసభ్యంగా ప్రవర్తించిన పోకిరీని పట్టుకున్న మహిళలు అతడిని స్తంభానికి కట్టేసి చావబాదారు. హైదరాబాద్‌లోని మూసాపేట పరిధిలో జరిగిందీ ఘటన. జింకలవాడకు చెందిన అంజి (19) శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో స్థానికంగా ఓ ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న యువతి చేయిపట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు మహిళలు యువకుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు.  
Go Back to Shorts
Hyderabad
Moosapet
Police

More Telugu News